ముద్దులతో ఏ పేచీ లేదు: మీనాక్షి

- Advertisement -
Meenakshi Chaudhary

‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో పరిచయమైంది మీనాక్షి చౌదరి. చండీగఢ్ కి చెందిన ఈ బ్యూటీ డాక్టర్ కూడా. ఆమె ప్రస్తుతం బీడీఎస్ చేస్తోంది. వైద్యం చదువుతూనే నటిస్తోంది. తాజాగా రవితేజ సరసన ‘ఖిలాడి’లో ముద్దు సీన్లు కూడా చేసింది.

ముద్దు సీన్లు, గ్లామర్ సన్నివేశాలతో తనకి ఇబ్బంది లేదంటోంది. ఆమె యాక్టింగ్ క్లాస్ లోనే ఇవన్నీ తెలుసుకొని వచ్చిందట. “క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో ఇలాంటి అంశాలుంటాయి. ద‌ర్శ‌కుడు క‌థ చెప్పినప్పుడే కేరెక్ట‌ర్ తీరు గురించి వివరించారు. ముద్దు సీన్లు నా పాత్ర స్వభావాన్ని బట్టి పెట్టారు,” అని చెప్తోంది.

కొన్ని సీన్స్ చేసేట‌ప్పుడు తాను బెరుకుగా వుంటే కంఫ‌ర్ట్ అయ్యేవ‌ర‌కు టైం తీసుకోమ‌ని రవితేజ సూచించారట .”చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో అన్ని ఎమోష‌న్స్ వుంటాయి. అవి హ్యూమ‌న్ ఎమోష‌న్సే. అంత‌కుమించి లైన్ క్రాస్ చేయం. ఇది కూడా న‌ట‌న‌లో ఓ భాగ‌మే,” అని చెప్పింది.

ప్రభాస్ సరసన కూడా ఈ భామకి అవకాశం వచ్చింది అని ఇటీవల పుకార్లు షికారు చేశాయి. “స‌లార్‌లో ప్రభాస్ సరసన చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇంకా అది ఖ‌రారు కాలేదు,” అని వివరణ ఇచ్చింది.

ALSO READ: రవితేజ కిస్సు కహానీ!

తెలుగులో మరో రెండు చిత్రాలు చర్చల్లో ఉన్నాయట. “అడవి శేష్ సరసన ‘హిట్ 2’ చేశాను. త‌మిళంలో విజ‌య్ ఆంథోని న‌టించిన ‘కొలై’లో న‌టించాను,” అని తన లైనప్ గురించి వివరించింది.

 

More

Related Stories