- Advertisement -

ఇది సినిమా హీరోయిన్లకు నిజంగానే పెళ్లిళ్ల సీజన్. వరుసపెట్టి హీరోయిన్లు పెళ్లి కబుర్లు మోసుకొస్తున్నారు. హీరోయిన్ మీరా చోప్రా కూడా పెళ్లి చేసుకుంటోంది.
40 ఏళ్ల మీరా చోప్రా తన ప్రియుడు రక్షిత్ కేజ్రీవాల్ ని పెళ్లాడనుంది. ఈ నెల 12న వీరి పెళ్లి. గత మూడేళ్ళుగా వీరు డేటింగ్ లో ఉన్నారట. జైపూర్ లో పెళ్లి వేడుక జరగనుంది. పెళ్లి కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
గతంలో ఈ భామ ఎన్నో వివాదాల్లో ఇరుక్కొంది. ప్రియాంక చోప్రాకి కజిన్ అవుతుంది మీరా చోప్రా.
తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన “బంగారం” వంటి సినిమాల్లో నటించింది. “మారో”, “వాన”, “గ్రీకు వీరుడు” వంటి సినిమాల్లో కూడా నటించింది.