ఆమెని లాగకండి: నాగ చైతన్య

Naga Chaitanya and Sobhita


సమంతకి నాగ చైతన్య డివోర్స్ ఇచ్చి చాలా కాలమే అయింది. అయినా ఆ విషయాలు నాగ చైతన్యని వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ‘కస్టడీ’ సినిమా ప్రమోషన్ సందర్భంగా ప్రతి మీడియా ఇంటర్వ్యూలో ఈ విషయాన్నీ ఫేస్ చేస్తున్నారు నాగ చైతన్య.

“వచ్చే సినిమాకైనా ఈ ప్రశ్నలు అడగడం మానెయ్యండి. ఇప్పటికే అనేక సార్లు వివరణ ఇచ్చాను. ఇంకా అదే విషయాన్ని అడుగుతున్నారు,” అని చికాకు పడుతున్నారు నాగ చైతన్య. అంతే కాదు, అలాగే సమంత, తన విడాకుల మేటర్ లోకి మూడో వ్యక్తిని లాగడం కరెక్ట్ కాదని చెప్తున్నారు చైతన్య.

నాగ చైతన్య ప్రస్తుతం హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్ లో ఉన్న విషయం మనకు తెలుసు. ఆమె వల్లే సమంత, నాగ చైతన్య విడాకుల వరకు వెళ్లి ఉంటారు అని ఒక వాదన ఇటీవల మొదలైంది. ఈ విషయంలో ఇప్పటికే శోభిత క్లారిటీ ఇచ్చింది. వాళ్ళ విషయంలో తనకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పింది.

నాగ చైతన్య కూడా అదే అంటున్నారు. ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని నా విడాకుల మేటర్ లోకి లాగడం సరైంది కాదు అంటూ మీడియాకి క్లాస్ పీకారు నాగ చైతన్య.

ఆమె గురించి మాట్లాడను: శోభిత

Sobhita Dhulipaa

శోభిత పేరు ప్రస్తావించకుండా మూడో వ్యక్తి పేరుని ముగిసిన నా వైవాహిక సమస్యల్లోకి తీసుకురావొద్దని నాగ చైతన్య క్లారిటీ ఇచ్చాడు. శోభితతో ఆయన డేటింగ్ డివోర్స్ తర్వాతనే మొదలైందట.

 

More

Related Stories