
నాని ఎప్పుడూ సినిమాలు స్పీడ్ గా చేస్తారు. ఏడాదికి మూడు సినిమాలు అయినా చెయ్యాలి అనేది టార్గెట్. ఐతే, ఆ టార్గెట్ ఇటీవల మిస్ అయింది. ఈ ఏడాది కేవలం ‘సరిపోదా శనివారం’ అనే సినిమానే విడుదల అయ్యేలా ఉంది. వచ్చే ఏడాది అయినా లక్ష్యం చేరుకోవాలి అనే ఉద్దేశంతో వరుసగా సినిమాలు ఫిక్స్ చేస్తున్నాడు.
నాని ప్రస్తుతం “సరిపోదా శనివారం” అనే సినిమాలో నటిస్తున్నాడు. అది ఆగస్టు చివరి వారంలో విడుదల అవుతుంది. ఇక ఆ తర్వాత చేయబోయే సినిమాలు ఏంటో వరుసగా ప్రకటించాడు. ఆ లిస్ట్ ఇదే…
- 32వ చిత్రం — సుజిత్ దర్శకుడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం. కుదిరితే ఈ ఏడాది డిసెంబర్ లో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల
- 33వ చిత్రం – ‘దసరా’ తీసిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మూవీ. 2025 వేసవిలో విడుదల.
- ఎల్లమ్మ. బలగం దర్శకుడితో తెలంగాణ నేపథ్యంగా నాని చిత్రం. 2025 చివర్లో రిలీజ్.
ఈ మూడు పూర్తి అయ్యాకే మిగతా కథలు వింటాడట.
ALSO READ: Nani as a leader in Dasara director’s next