
నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకున్నారోచ్ …
మీడియా అంతా ఇప్పుడు ఈ వార్తలే. నిజమే, ఈ వార్తలు రావడంలో తప్పు లేదు. నరేష్ స్వయంగా తన ట్విట్టర్ లో ఒక వీడియో పెట్టాడు. పవిత్ర లోకేష్ కి మూడు ముళ్ళు వేస్తున్న వీడియో అది. ఇద్దరూ ఏడడుగులు వేసినట్లుగా ఉంది ఆ వీడియోలో. సంప్రదాయబద్ధమైన వేడుక జరిగినట్లు కనిపిస్తోంది.
దాంతో, అందరూ వీరికి పెళ్లయింది అని అనుకుంటున్నారు. కానీ ఇది నిజం కాదు.
ఆ మూడుముళ్లు సన్నివేశం ఒక సినిమాలోది. ఆ సినిమాకి హైప్ తెచ్చేందుకు ఈ పబ్లిసిటీని వాడుకుంటున్నారట.
నరేష్, పవిత్ర లోకేష్ కలిసి ఉంటున్న మాట నిజం. పెళ్లి చేసుకోవాలనుకున్నది నిజం. కానీ, లీగల్ గా వారు ఒకటి కాలేరు. ఎందుకంటే నరేష్ కి ఆయన మూడో భార్య విడాకులు ఇచ్చేందుకు నిరాకరించింది. లీగల్ గా నరేష్ ఇంకా తన మూడో భార్య రమ్య రఘుపతికి భర్త. ఆమె నుంచి డివోర్స్ పొందకుండా నరేష్ పవిత్రకు మూడు ముళ్ళు వెయ్యలేడు. ఒకవేళ పెళ్లి చేసుకున్నా లీగల్ గా చెప్పుకోలేడు.
ALSO READ: Naresh and Pavitra Lokesh’s ‘wedding video’ is out!