నిహారిక, ఆమె భర్త వెంకట చైతన్య జొన్నలగడ్డ విడిపోయి చాలా కాలమే అవుతోంది. వీరి పెళ్లి, కాపురం, విడిపోవడం…అన్ని స్పీడ్ గా జరిగిపోయాయి. ఆమె ఇప్పుడు గతాన్ని మరిచిపోయి కెరీర్ పై దృష్టి పెట్టింది. ఐతే, ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆమె తన విడాకులకు దారితీసిన పరిస్థితులు, ఆ తర్వాత తాను ఎదుర్కున్న మానసిక సంఘర్షణ గురించి మాట్లాడింది.
తాను ఎంతో వేదన అనుభవించినట్లు తెలిపింది. ఈ ఇంటర్వ్యూ లింక్ ని ఆమె మాజీ భర్త తన సోషల్ మీడియాలో పెడుతూ ఘాటుగా స్పందించారు.
నిహారిక నీ మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు చేసిన ప్రయత్నం మంచిదే కానీ అదే సమయంలో ఇతరులను నువ్వు కూడా నిందించడం మానుకోవాలి అని గట్టిగా సమాధానం ఇచ్చారు. అంతేకాదు నిహారిక ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు అంటూ నిందించారు చైతన్య జొన్నలగడ్డ.
“విడాకుల గురించి మాట్లాడేప్పుడు రెండువైపులా చూడాలి. ఒకరి వర్షన్ చెప్పేసి ఇతరుల బాధ గురించి పట్టించుకోకపొతే ఎలా. జరిగిందేంటో పూర్తిగా తెలుసుకోకుండా తీర్పులు ఇవ్వడం ఎంత తప్పో … ఇలాంటి వేదికల నుంచి ప్రజలకు ఒక వర్షన్ మాత్రమే చెప్పడం కూడా తప్పు. ఇంకోసారి ఇలాంటివి చెయ్యకు,” అని ఆమె మాజీ భర్త పోస్టులో రాశారు.
ALSO READ: Niharika: The doors of my heart are not closed
చూస్తుంటే ఇటు నిహారిక, అటు చైతన్య మధ్య చాలా గొడవలే జరిగినట్లు కనిపిస్తున్నాయి.