
ఇటీవల కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాని ఎన్టీఆర్ కలవడం పెద్ద చర్చకే దారితీసింది. ఐతే, వీరిమధ్య రాజకీయ చర్చలు జరగలేదని ఎన్టీఆర్ టీం, వర్గం చెపుతూ వస్తోంది. కేవలం “ఆర్ ఆర్ ఆర్” సినిమాలో ఎన్టీఆర్ నటనకి ముగ్దుడై ప్రశంసించేందుకు అమిత్ షా కలిసినట్లుగా కలర్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఐతే, ఇప్పటికే ఎన్టీఆర్ కి తెలంగాణ ప్రభుత్వం మొదటి ఝలక్ ఇచ్చింది.
ఇప్పుడు ఎన్టీఆర్ ని మరింత ఇరకాటంలో పడేశారు ఆంధ్రపదేశ్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు.
“జూనియర్ ఎన్టీఆర్ సేవలను ఉపయోగించుకుంటాం. ఆయనకు చాలా ప్రజాదరణ ఉంది. ఆయన క్రేజ్ ఎక్కువగా ఎక్కడ ఉంటే ఆయన సేవలు అక్కడే ఉపయోగించుకుంటాం,”అని సోము వీర్రాజు ఆదివారం విలేకరుల సమావేశంలో చెప్పారు.
ALSO READ: అమిత్ షా, కేసీఆర్… ఎన్టీఆర్!
అంటే, ఎన్టీఆర్ బీజేపీ “ఫోల్డ్”లోనే ఉన్నారు అని క్లారిటీ ఇచ్చారు సోము వీర్రాజు. మరి ఎన్టీఆర్ ఇప్పుడు ఏమంటారో. అమిత్ షాతో భేటీ మర్యాదపూర్వక మీటింగ్ అని ఇప్పటివరకు చెప్పుకుంటున్న ఎన్టీఆర్ ఇప్పుడు అడ్డంగా ఇరుక్కున్నారు. మరి వీర్రాజు మాటలకు ఎన్టీఆర్ స్పందించకపోతే ఆయన బీజేపీ సానుభూతిపరుడిగానే లేదా బీజేపీ టీంమెంబర్ గానే ఇతర పార్టీలు భావిస్తాయి.