
పవన్ కళ్యాణ్ ఆ మధ్య చాలా సినిమాలు ఒప్పుకున్నారు. ఒకేసారి 5 సినిమాలు సైన్ చేశారు. ఐతే, సెట్స్ మీదకు నాలుగు సినిమాలు వెళ్లిన తర్వాత ఆయన రాజకీయాలతో బిజీ అయ్యారు. దాంతో, అన్నింటికీ బ్రేకులు పడ్డాయి. అందులో ఒక సినిమా స్పీడ్ గేర్ లో వెళ్తోంటే, మరోటి 20 స్పీడ్ లో వెళ్తోంది. ఇంకోటి పార్కింగ్ లోనే ఉండిపోయింది. మరో రెండు సినిమాలకు ఇంకా కొబ్బరికాయ కొట్టలేదు.
ఐతే, తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి – నిర్మాత రామ్ తాళ్లూరి ఒక కొత్త ఆఫీస్ తీసుకున్నారు. ఈ రోజు ఈ ఆఫీస్ లో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. సురేందర్ రెడ్డి – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా ప్రకటన వచ్చి రెండేళ్లు అయింది. ఇప్పుడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కి కదలిక వచ్చింది.
అంటే, ఇప్పటికే ప్రారంభించి సగం పూర్తి చేసిన “ఓజీ”, ఒక షెడ్యూల్ పూర్తి చేసిన “ఉస్తాద్ భగత్ సింగ్”, 75 శాతం పూర్తి చేసిన “హరి హర వీర మల్లు”తో పాటు ఇప్పుడు సురేందర్ రెడ్డి సినిమా కూడా లైన్ లోకి వచ్చింది. దర్శకుడు సుధీర్ వర్మతో కూడా ఒక సినిమాని ఆ మధ్య ప్లాన్ చేశారు పవన్ కళ్యాణ్.
సో, ఈ మొత్తం ఐదు సినిమాలను ఎన్నికలకు ముందో, ఎన్నికలకు తర్వాతో పూర్తి చేస్తారు. ఒప్పుకున్న 5 సినిమాలు కంప్లీట్ చెయ్యడం ఐతే ఖాయం.