
ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ మొదటి వారం పూర్తి చేసుకొంది. ఫలితం: దారుణ పరాజయం. తెలుగులో కాస్తో కూస్తో కలెక్షన్లు వచ్చాయి. కానీ, హిందీలో ఐతే ఘోర పరాభవం.
‘సాహో’ సినిమాకి మొదటి రోజు హిందీలో 25 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ‘రాధేశ్యామ్’కి మొదటి వారంలో వచ్చిన వసూళ్ల 18 కోట్లు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు…ఇది ఏ రేంజ్ లో అపజయం అయిందో. ఈ సినిమా విడుదలైన రెండో రోజే ప్రభాస్ విదేశాలకు వెళ్ళిపోయారట. ఈ సినిమాకి రిలీజ్ తర్వాత ప్రొమోషన్ చెయ్యాల్సిన అవసరం కలగదు అని ముందే తెలుసు కాబోలు. అందుకే, రెండో రోజే పయనం.
విదేశాల్లో ప్రభాస్ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. కొంతకాలంగా ఈ ట్రీట్మెంట్ ని వాయిదా వేస్తూ వచ్చారు. ఇప్పుడు, టైం గ్యాప్ దొరికింది అని వెళ్లారు.
ప్రభాస్ వచ్చేనెల హైదరాబాద్ వస్తారు. ఆ తర్వాతే కొత్త సినిమా షూటింగ్ షురూ అవుతుంది. మారుతి దర్శకత్వంలో ఒక కొత్త చిత్రం మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాతో పాటు ‘సలార్’ షూటింగ్ కూడా జరుగుతుంది.
Also Read: Radhe Shyam has a disastrous run in the first week