గుండు కొట్టించుకున్న ఫ్యాన్ కి గిఫ్ట్!


ప్రభాస్ కి డై హార్డ్ ఫ్యాన్స్ కోకొల్లలు. సినిమా అప్డేట్ టైంకి ఇవ్వకపోతేనే చస్తామని బెదిరించేవాళ్లున్నారు. ఇక వొంటి మీద ప్రభాస్ టట్టూ, వెహికిల్ పై ప్రభాస్ ఫోటోతో కనిపించే ఫ్యాన్స్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అలాంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు.

ఐతే, ఒక అభిమాని ఏకంగా ప్రభాస్ కోసం గుండు కొట్టించుకున్నాడు. తన తలపై PRABHAS అనే అక్షరాలు మాత్రమే ఉండేలా డిజైన్ చేయించుకున్నాడు తన హెయిర్ స్టయిల్ పరంగా. ఆ అభిమాని గురించి తెలుసుకున్న ప్రభాస్ అతనితో ముచ్చటించారు. అతని అభిమానానికి ఫిదా అయ్యారు ప్రభాస్. అలాగే, ఒక ఖరీదైన బహుమతి ఇచ్చారట. ఒక వాచ్ ఇచ్చారని టాక్.

ఆ అభిమానితో ప్రభాస్ ముచ్చటిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ‘రాధే శ్యామ్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement
 

More

Related Stories