ప్రకాష్ రాజ్ చెంపదెబ్బపై రగడ

Prakash Raj

ఇటీవల అమెజాన్ లో విడుదలైన ‘జై భీం’ అనే సినిమాకి మంచి ప్రసంశలు వచ్చాయి. ఇది అందరికి నచ్చే సినిమా కాదు కానీ అర్ధవంతమైన చిత్రం. ఐతే, ఈ సినిమాలో ఒక సీన్ పై రగడ మొదలైంది.

ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఒక పొలీసు ఉన్నతాధికారిగా నటించారు. ఒక కేసులో భాగంగా మార్వాడి నగల వ్యాపారిని విచారిస్తున్న సీన్ ఉంది మూవీ. ఆ నగల వ్యాపారి హిందీలో మాట్లాడుతుంటే…ప్రకాష్ రాజ్ చెంప వాయిస్తాడు. తమిళ్ లో మాట్లాడు అని కొడుతాడు. ఈ సీన్ పై ఇప్పుడు నార్త్ ఇండియన్స్ అభ్యంతరం తెలుపుతున్నారు. నార్త్ ఇండియన్ కి చెందిన వ్యక్తి హిందీలో మాట్లాడితే చెంప దెబ్బ కొట్టడం ఎందుకు? తమిళంలో మాట్లాడమని చెప్పొచ్చు కదా అని హిందీ ఆడియెన్స్ అడుగుతున్నారు.

తమిళనాడులో హిందీ వ్యతిరేకత ఎక్కువ. అక్కడ రాజకీయనాయకులు, సినిమా స్టార్స్ ఈ సెంటిమెంట్ ని ఎక్కువ వాడుకుంటారు.

పాన్ ఇండియా మార్కెట్ అంటూ జపం చేసే దక్షిణాది హీరోలు ఇలాంటి సీన్లకు ఎలా ఒప్పుకుంటున్నారు అని సూర్యని విమర్శిస్తున్నారు. నేను అన్ని ప్రాంతాల వాడిని అని సెల్ఫ్ డబ్బా కొట్టుకునే ప్రకాష్ రాజ్ మరి హిందీ మాట్లాడే వారిని కొట్టే సీన్లో ఎలా నటించాడు అంటూ లా పాయింట్ లేవదీస్తున్నారు.

జైభీం – రివ్యూని ఇక్కడ చదవండి

విచిత్రం ఏమిటంటే… ఈ సినిమా హిందీలో కూడా విడుదలైంది. హిందీ వర్షన్ లో ఆ సీన్ లో డైలాగ్స్ మార్చారట. తమిళ్ లో మాట్లాడు అని ప్రకాష్ రాజ్ అడిగే డైలాగ్ ‘అబ్ సచ్ బతాహో’ (ఇప్పుడు నిజం చెప్పు) అని మార్చారు.

Advertisement
 

More

Related Stories