రవితేజకి రజినీకాంత్ నుంచి పోటీ

ఈ సంక్రాంతి పోటీ నుంచి తప్పుకున్నారు మాస్ మహారాజా రవితేజ. జనవరి 13న విడుదల కావాల్సిన “ఈగిల్”ని ఇండస్ట్రీ బాగు కోసం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు రవితేజ. తెలుగు సినిమాల నిర్మాతల మండలి కూడా రవితేజకి ధన్యవాదాలు తెలిపింది. రవితేజ సినిమా కొత్త డేట్ నాడు మరేఇతర సినిమాలు విడుదల కాకుండా ప్రయత్నిస్తామని తెలిపింది మండలి.

దాంతో, ఫిబ్రవరి 9న తన సినిమా విడుదల చేస్తానని అన్నారు రవితేజ. అలా “ఈగిల్”కి కొత్త డేట్ ఫిక్స్ అయింది. ఆ రోజు విడుదల కావాల్సిన “టిల్లు స్క్వేర్”ని వాయిదావేశారు. కానీ, ఇప్పుడు మరో సినిమా పోటీకి వచ్చింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు దర్శకత్వం వహించిన “లాల్ సలామ్” సినిమా ఫిబ్రవరి 9న విడుదల కానుంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఒకేసారి ఆ రోజు విడుదల అవుతుంది. ఇందులో రజినీకాంత్ ‘పెదరాయుడు’ సినిమా తరహాలో అతిథి పాత్ర పోషించారు. సో, రవితేజ సినిమాకి రజినీకాంత్ నుంచి పోటీ తప్పదు.

అలాగే, ఫిబ్రవరి 9న “యాత్ర” సినిమా కూడ విడుదల అయ్యే అవకాశం ఉంది. మొత్తమ్మీద రవితేజకి ఎంతో కొంత ఈ సినిమాల నుంచి పోటీ ఉంటుంది.

Advertisement
 

More

Related Stories