అత్యాశకు పోని రవితేజ

- Advertisement -
Ramarao on Duty


రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా టికెట్ ధరల విషయంలో సరైన నిర్ణయం తీసుకొంది. అత్యాశకు పోలేదు. హైద్రాబాద్లో మల్టిప్లెక్స్ రేట్లను 190లోపే ఉంచారు. ఏఎంబి మినహా మిగతా మల్టిప్లెక్స్ లలో ఈ ధరలు. సింగిల్ థియేటర్ లో కూడా సాధారణ రేట్లకే అమ్ముతున్నారు.

రవితేజ పెద్ద హీరో. పైగా మాస్ హీరో. ఐతే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ రేట్లకి అమ్మితే చాలా కష్టం. అసలే జనం థియేటర్ల వైపు చూపు వెయ్యట్లేదు. అందుకే, రవితేజ టీం సరైన ఆలోచించి ఈ ధరలు ఫిక్స్ చేసింది.

రవితేజకి ఇప్పుడు హిట్ అవసరం. ‘క్రాక్’ పెద్ద హిట్ అయింది. కానీ, ఆ తర్వాత వచ్చిన ‘ఖిలాడి’ పడకేసింది. ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. సో, ఇప్పుడు విజయం అందుకుంటే ‘ఖిలాడి’ని జనం మర్చిపోతారు.

ఈ సినిమాకి శరత్ మండవ దర్శకుడు. రవితేజ ఈ చిత్రంలో మండల రెవెన్యూ ఆఫీసర్ గా నటించారు.

ALSO READ: Divyansha Kaushik: I am game for all sorts of roles

 

More

Related Stories