ఇంకా 40 రోజులు తీయాలా?

Ram Charan in RRR


రాజమౌళి సినిమాకి గుమ్మడికాయ ఎప్పుడు కొడుతారో ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. తన విజన్ కి తగ్గట్లు ఎన్ని రోజులైనా, ఎంత లేటైనా రాజీపడరు జక్కన్న. ఇంతకీ, “ఆర్ ఆర్ ఆర్” ఎప్పుడు పూర్తి అవుతుంది?

కరోనా రెండో వేవ్ కారణంగా గత నెలలో షూటింగ్ నిలిపివేశారు. ఇంకో రెండు వారాలు తీసి ఉంటే అయిపోయేది అని మొన్నటి వరకు టీం చెప్పింది. కానీ లేటెస్ట్ గా తేలిందేంటంటే… నాలుగు వారాలకి పైగా చిత్రీకరణ మిగిలే ఉందట. మరో పది రోజులు ప్యాచ్ వర్క్ కి వేసుకుంటే 40 వర్కింగ్ డేస్ పని మిగిలి ఉన్నట్లు. అంటే.. లాక్డౌన్ తర్వాత షూటింగ్ రీస్టార్ట్ అయినా కూడా వెంటనే పూర్తి అవదు. మరో రెండు, మూడు నెలల టైం పడుతుంది గుమ్మడికాయ కొట్టడానికి.

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఆగస్టు, సెప్టెంబర్ వరకు ఈ సినిమాతోనే ఆక్యుపై అయి ఉండాలి. వారి తదుపరి చిత్రాల షూటింగ్ లు మొదలు కావడానికి చాలా టైం పట్టేలా ఉంది.

More

Related Stories