కొద్దిగా ఊపిరి పీల్చుకున్నట్లే

Sharwanand

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరడజను అపజయాలు చూశాడు హీరో శర్వానంద్. అవును వరుసగా ఆరు ఫ్లాపులు. ఏ హీరోకైనా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది. మరి ఇలాంటి టైంలో అంచనాలే లేని ఒక సినిమాకి మంచి టాక్, మంచి రేటింగ్స్ వస్తే పెద్ద సంబరమే కదా. అదే జరిగింది ఇప్పుడు.

శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ ఈ రోజు (సెప్టెంబర్ 9) విడుదలైంది. రివ్యూస్ ఏకపక్షంగా పాజిటివ్ గా వచ్చాయి. మౌత్ టాక్ కూడా బాగుంది. కాకపొతే, ‘బ్రహ్మాస్త్ర’ వంటి పెద్ద సినిమా ముందు ఈ సినిమా కలెక్షన్లు సాధించలేకపోయింది. ఇకపై పెరుగుతాయేమో చూడాలి.

ALSO READ: Oke Oka Jeevitham Review: A feel-good drama!

కలెక్షన్ల సంగతి ఎలా ఉన్నా చాలా గ్యాప్ తర్వాత తనకి నెగెటివ్ కామెంట్స్ రాలేదు. అదే పెద్ద సక్సెస్. శర్వానంద్ కి ఈ సినిమా కాస్త ఊపిరి పీల్చుకునేలా చేసింది.

శర్వానంద్ ఇకపై కథాబలం ఉన్న సినిమాలు చేస్తేనే బెటర్. ఇప్పటికే దర్శకుడు కృష్ణ చైతన్య తీసే కొత్త చిత్రం సైన్ చేశాడు.

 

More

Related Stories