బిగ్ బాస్ లోకి తల్లీకూతుళ్లు!

Surekhavani and Supritha

“బిగ్ బాస్” కొత్త సీజన్ మొదలైనప్పుడల్లా సురేఖావాణి పేరు వినిపించింది. కానీ, ఆమె ఇంతవరకు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆమెతో పాటు ఆమె కూతురు పేరు కూడా వినిపిస్తోంది. “బిగ్ బాస్ 7” వచ్చే నెల మొదలు కానుంది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ లు ఎవరు అనే విషయంలో రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి.

అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత. ‘బిగ్ బాస్ హౌజ్’లో ఇప్పటివరకు భార్యాభర్తలు జంటగా అడుగుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ, మొదటిసారి తల్లీకూతుళ్లు ఎంట్రీ ఇవ్వనున్నారు.

సుప్రీత ఇంకా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు కానీ ఆమె తన రీల్స్ తో పాపులర్ అయింది. దాదాపు 6 లక్షల మంది ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక సురేఖకి మంచి ఫాలోయింగ్ ఉంది కదా.

‘బిగ్ బాస్ 7’ లో కూడా 20 మంది కంటెస్టెంట్ లు పాల్గొంటారు.

Advertisement
 

More

Related Stories