కొత్త ఏడాది ఎలా ఉంది?

Trisha

త్రిష సోషల్ మీడియాలో యాక్టీవిటి తగ్గించింది. ఎన్నో ఏళ్ల తరబడి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన వందలాది ఫోటోలని డిలీట్ చేసింది. 2021లో ఆమె మళ్ళీ యాక్టీవ్ అవుతుందని అనుకున్నారు. కానీ కొత్త ఏడాదిలో కూడా పెద్దగా హడావిడి చెయ్యడం లేదు. ఈ ఏడాదిలో 20 రోజులు గడిచిన తర్వాత ఫస్ట్ టైం తన ఫోటోని షేర్ చేసింది.

“2021 ఎలా ఉంది? ఎలా గడుస్తోంది మీకు,” అంటూ ఒక ఫోటో పోస్ట్ చేసింది. కారులో ప్రయాణిస్తూ తీసుకున్న ఫోటో అది.

త్రిష ప్రస్తుతం మణిరత్నం తీస్తున్న “పొన్నియన్ సెల్వన్” సినిమాలో నటిస్తోంది. తెలుగులో ఇంకా మూవీ సైన్ చెయ్యలేదు. “ఆచార్య” సినిమాలో చిరంజీవి సరసన ఆమె నటించాలి. కానీ దర్శకుడు కొరటాలకి, ఆమెకి డిఫరెన్సెస్ రావడంతో ఆమె సెట్ లోకి అడుగు పెట్టకముందే తప్పుకొంది. 37 ఏళ్ల త్రిష పెళ్లి ముచ్చట కూడా పక్కన పెట్టింది.

ఏజ్ బార్ అయిపోయినా ఇంకా పెళ్లి చేసుకొని ప్రభాస్, అనుష్క వంటి సెలెబ్రిటీల లిస్ట్ లో త్రిష కూడా చేరింది.

More

Related Stories