త్రిష లీగల్ యాక్షన్ షురూ

- Advertisement -

త్రిష ఈ సారి గట్టిగానే స్పందించింది. సైలెంట్ గా ఊరుకుంటే రాళ్లు వేస్తూనే ఉన్నారని గ్రహించిన త్రిష రాజకీయనాయకుడు రాజాకి లీగల్ నోటీసులు జారీ చేసింది.

తమిళనాడుకు చెందిన ఏవీ రాజు అనే నాయకుడు ఇటీవల త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన పరువుకు నష్టం కలిగించిన అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె పరువునష్టం దాఖలు చేసింది. బహిరంగ క్షమాపణ కోరుతూ ఆమె తరఫున లాయర్లు అతనికి నోటీసులు జారీ చేశారు. ఐతే, ఇప్పటికే రాజు తన మాటలను వక్రీకరించారని, త్రిషకి సారీ చెప్తున్నాను అంటూ ప్రకటన చేశారు.

కానీ త్రిష లీగల్ పోరాటం చేద్దామని భావిస్తున్నట్లు ఉంది. ఇంకోసారి మరెవ్వరు తనని అనవసరంగా వివాదాలకు లాగకుండా, తన గురించి అసభ్యంగా మాట్లాడకుండా ఆమె ఈ సారి కోర్టుని ఆశ్రయిస్తోంది.

“ఎమ్మెలేలు పార్టీ ఫిరాయించకుండా ఒక రిసార్ట్ లను ఉంచితే, అందులో ఒక ఎమ్మెల్యే తనకు త్రిష కావాలని కోరాడు. త్రిషకు ఎమ్మెల్యే వెంకటాచలం 25 లక్షలు ఇస్తుండగా నేను కళ్లారా చూశాను,” అని రాజు ఇటీవల కామెంట్ చేశాడు. ఐతే, ఇప్పుడు నేను అన్నది వేరు, జనం అర్థం చేసుకున్నది వేరు అంటున్నాడు ఆయన. ఆమె రిసార్ట్ కు వచ్చింది అనలేదు అని చెప్తున్నాడు.

ALSO READ: త్రిషని టార్గెట్ చేశారా?

 

More

Related Stories