విజయ్ దేవరకొండతోనే అంటున్న శివ

- Advertisement -
Vijay Devarakonda


విజయ్ దేవరకొండ రెండేళ్ల నుంచి ఒకే సినిమాతో స్టక్ అయిపోయారు. పూరి జగన్నాధ్ తీస్తున్న ‘లైగర్’ ముందుకు కదలడం లేదు. ఈ సినిమాని త్వరగా పూర్తి చెయ్యడానికి పూరి పడుతున్న ఇబ్బంది ఏంటో తెలీదు. ఐతే, విజయ్ దేవరకొండతో సినిమాలు తీద్దామని అనుకుంటున్న నిర్మాతలు, దర్శకులు మాత్రం వెయిట్ చెయ్యలేక ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది.

హీరో విజయ్ దేవరకొండతోనే తన నెక్స్ట్ సినిమా అని దర్శకుడు శివ నిర్వాణ పట్టుపట్టి కూర్చున్నాడు. ‘లైగర్’ ఎప్పుడు పూర్తి అయితే అప్పుడే ఉంటుంది అని చెప్తున్నాడు శివ నిర్వాణ.

‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాల తర్వాత శివ నిర్వాణ తీసిన ‘టక్ జగదీష్’ సినిమా ఈ శుక్రవారం అమెజాన్ లో విడుదలవుతోంది. దీనిపై మంచి అంచనాలున్నాయి. ఈ వీకెండ్ తో శివ ఈ సినిమాకి సంబందించిన పనుల నుంచి బయటపడుతారు. ఇప్పటికే విజయ్ కి కథ చెప్పి ఓకే చేయించుకున్నారట. ఇక, దాన్ని ఫుల్ స్క్రిప్ట్ గా మలిచే పనుల్లో ఉంటారన్నమాట.

విజయ్ దేవరకొండ శివ నిర్వాణ సినిమాతో పాటు దర్శకుడు సుకుమార్ తో ఒక సినిమా ఒప్పుకున్నారు. కానీ సుకుమార్ సినిమా ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు లేవు.

Also Read: Shiva Nirvana: Tuck Jagadish is an emotional drama

 

More

Related Stories