
విశ్వక్ సేన్ నటించిన ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ సినిమా విడుదలయింది. ఈ సినిమా కథలో కన్నా కథనంలో మెచ్చుకునే అంశాలు ఉన్నాయి. సినిమా స్లోగా సాగింది అనేది పక్కన పెడితే విశ్వక్ సేన్ నటన బాగుంది. అందులోనూ పరిణతి కనిపించింది.
విశ్వక్ సేన్ ఇప్పటివరకూ రఫ్ అండ్ టఫ్ పాత్రలు చేశాడు. అతని నటనలో ఈజ్ ఉంటుంది. కానీ, ఈ సినిమాలో పాత్రకు తగ్గట్లుగా ఒదిగిపోయాడు. పూర్తిగా డామినేట్ చెయ్యకుండా పాత్రకు ఎంత కావాలో అంతే చేశాడు. అదే నటుడిగా మెచ్యూరిటీ చూపించడం అంటే.
విశ్వక్ సేన్ తన లుక్ మీద తానే జోకులు వేసుకున్నాడు. పొట్ట పెంచుకొని నటించాడు. అలాగే, ముద్దు సన్నివేశాలు లేకుండా ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కొత్త తరం హీరోల్లో కొందరు తమ పాత్రలను బాగా అర్థం చేసుకుంటున్నారు. ఈ సినిమాలో విశ్వక్ అది చూపించాడు.
మరోవైపు, ఈ సినిమాతో కొత్త భామ రితిక నాయక్ కూడా మెప్పించింది.