
‘బిగ్ బాస్ తెలుగు 5’ కంటెస్టెంట్ లలో యాంకర్ రవి చాలా పాపులర్. ఉన్న సెలెబ్రటీలల్లో అతనికే ఎక్కువ క్రేజ్ ఉంది. మరి, యాంకర్ రవి మొదటి వారమే తప్పుకుంటాడా? అతనికి బయట ఉన్న కార్యక్రమాలు అలాంటివి కదా. ఎదో మొహమాటం కోసం ఒక వారం రోజులు ఉందామని వచ్చాడా? ఇలాంటి ప్రశ్నలు ఉదయయిస్తున్నాయి. దానికో కారణముంది.
మొదటివారం ఎలిమినేషన్ కోసం ఆరుగురు నామినేట్ అయ్యారు. ఇందులో యాంకర్ రవి కూడా ఉండడం విశేషం. అంత పెద్ద పాపులర్ ఫేస్ ని ఫస్ట్ వీక్ పంపిచేస్తారా అన్న అనుమానాలు వస్తున్నాయి. గతంలో అలా రెండు సందర్భాల్లో జరిగాయి. పాపులర్ అనుకున్న వాళ్ళు రెండు, మూడు వారాల్లోనే వెళ్లిపోయారు. యాంకర్ రవి కూడా అలాగే ఎలిమినేట్ అవుతాడా అన్న డౌట్స్ వస్తున్నాయి.
కానీ, రవి మొదటి వారం ఎలిమినేషన్ కి వచ్చినా… చివరివరకు ఉంటాడు అన్న అభిప్రాయం కూడా ఉంది. శ్రీముఖి కూడా అలాగే చివరి వరకు ఉంది. మొదటి వారమే కార్యక్రమంపై ఆసక్తి కలిగేలా అలా చేసి ఉంటారు అనిపిస్తోంది.
రవితో పాటు కాజల్, జెస్సీ, సరయు, హమీద, మానస్ కూడా నామినేట్ అయ్యారు. రవితో పాటు కాజల్ కూడా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది.
ఈ ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తోంది?