
నయనతారపై విమర్శలు మొదలయ్యాయి. పెళ్ళైన మూడు నెలలకే ఆమె ట్విన్స్ ని పొందింది. అంటే పెళ్ళికి ఆర్నెళ్ల ముందే ఆమె ‘సరోగసి’కి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇది చట్టపరంగా నేరమే.
పిల్లలు కలిగేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించినా ఫలితం లేదని, మెడికల్ కండిషన్ ప్రకారం డాక్టర్లు సర్టిఫై చేసిన తర్వాతే సరోగసీని అనుమతించాలి. చట్టం చెబుతోంది ఇదే. కానీ సెలెబ్రిటీలు తమ చిత్తం వచ్చినట్లు ఈ సరోగసి ద్వారా పిల్లలను కంటున్నారు. నయనతార పెళ్ళికి ఆరేళ్ళ ముందు నుంచి సహజీవనం చేస్తున్న మాట వాస్తవమే కానీ పెళ్లి అయింది మాత్రం మూడు నెలలు క్రితమే.
అందుకే, తమిళనాడు ప్రభుత్వం ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు మొదలయ్యాయి. ప్రభుత్వం కూడా ఇప్పటికే చర్యలు మొదలుపెట్టిందని అంటున్నారు. ఐతే, స్టాలిన్ ప్రభుత్వం నయనతారపై చర్యలు తీసుకుంటుంది అనుకోలేం. ఉదయనిధి స్టాలిన్ … నయనతార, ఆమె భర్త విగ్నేష్ కి మిత్రుడు.
ఇక స్టాలిన్ ప్రభుత్వం సినిమా వాళ్ళతో మమేకమై ఉంది. నయనతారకి అక్కడ సూపర్ స్టార్ ఇమేజ్ ఉంది. సో… ఉత్తుత్తి హడావుడి తప్ప ‘చట్టపరమైన’ చర్యలు ఏమి ఉండవు అనిపిస్తోంది.

Also Read: నయనకి కవలలు, చారి ముందే చెప్పాడు!