
“ఒక హీరోతో తాను సరసం ఆడేందుకు ప్రయత్నించాను, ఇంప్రెస్ చెయ్యడానికి ట్రై చేశా కానీ అతను నన్ను పట్టించుకోలేదు.” ఇది కంగన రనౌత్ చెప్పిన ముచ్చట.
ఆ హీరో ఎవరో కాదు అక్షయే ఖన్నా. ఇటీవల “ధురంధర్” సినిమాలో విలన్ గా నటించిన అక్షయే ఖన్నా గురించి ఇప్పుడు అందరూ పొగుడుతున్నారు. వెండితెరపై రెచ్చిపోయి అద్భుతంగా నటించే అక్షయ్ నిజ జీవితంలో సైలెంట్ గా ఉంటాడనీ, తనదైన ప్రపంచంలోనే ఉంటాడని అంటున్నారు. అక్షయ్ వ్యక్తిత్వం గురించి కంగనా కూడా గొప్పగా చెప్పింది
“అక్షయే ఖన్నా, ఇతర నటులతో కలిసి ఒక సినిమాలో నటిస్తుండగా సెట్ లో ఉన్న అతనితో మాటలు కలిపి ఫ్లర్ట్ చేశాను. కానీ అతని నుంచి నో రెస్పాన్స్. అక్షయ్ ఖన్నా ఎవరినీ పట్టించుకోడని అర్థమైంది. ఆయనదో ప్రపంచం,” అని ఆమె పేర్కొంది.
ఇప్పటివరకు తాను పనిచేసిన హీరోలు, నటుల్లో అక్షయేది ప్రత్యేకమైన పద్దతి అని చెప్పింది. తాను ఫ్లర్ట్ చేస్తే పట్టించుకోని ఏకైక హీరో అతనే అని తెలిపింది.
