
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) చాలా కాలంగా “జైలర్ 2” (Jailer 2) సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదల తేదీ యిప్పటికే రెండు సార్లు మారింది.ఇది పూర్తి కాకముందు రెండు కొత్త సినిమాలను ప్రకటించారు రజినీకాంత్. ఒకటి తాను, కమల్ హాసన్ హీరోలుగా నటించే చిత్రం. ఆ సినిమాని ‘జైలర్ 2’ దర్శకుడు నెల్సన్ తీస్తాడు.
ఐతే మరో సినిమా (Thalaivar173) విషయంలోనే సమస్య. కమల్ హాసన్ నిర్మాతగా రజినీకాంత్ హీరోగా ఒక సినిమా ప్రకటించి చాలా కాలం అవుతోంది. కానీ ఈ సినిమాకి దర్శకులు మారుతున్నారు.
ఈ చిత్రాన్ని మొదట సుందర్ కి అప్పగించారు, కానీ స్క్రిప్ట్ విషయంలో విభేదాల కారణంగా ఆయన తప్పుకున్నారు. ఆ వెంటనే తమిళ యువ దర్శకుడు సిబి చక్రవర్తిని కొత్త డైరెక్టర్ గా ప్రకటించారు. అయితే, ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తాజా సమాచారం. ఇప్పుడు ఈ చిత్రాన్ని తన చేతుల్లోకి తీసుకునేందుకు యువ దర్శకుడు అశ్వత్ మరిముత్తు ప్రయత్నిస్తున్నారట.
ఇంకా అధికారికంగా సమాచారం లేకపోయినప్పటికీ ఈ సినిమా విషయంలో దర్శకులు మారుతుండడం అభిమానుల్లో గందరగోళం, ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.
కథ విషయంలోనే రజినీకాంత్ కి, ఈ దర్శకులకీ సమస్య వస్తోందట. రజినీకాంత్ కోరుతున్న మార్పులు చెయ్యలేకపోతున్నారట.
