
వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తాడు అని పేరు తెచ్చుకున్నాడు అడివి శేష్. ఇప్పటివరకు అతను చేసిన చిత్రాలు అలా ఉన్నాయి. ఐతే, ఒక్కో సినిమా పూర్తి చెయ్యడానికి ఏళ్ళు తీసుకుంటున్నాడు, సినిమాలను వాయిదా వేస్తూ నిర్మాతలకు భారం అయ్యేలా చేస్తున్నాడు అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
తాజాగా నటిస్తోన్న డెకాయట్ (Dacoit) మరోసారి వాయిదా పడుతుంది అనే ప్రచారం కూడా మొదలైంది. కానీ అవన్నీ అబద్దాలే అని తేలింది. డెకాయట్ సినిమా ఏప్రిల్ లోనే థియేటర్లలోకి రానుంది. మొదటి పాటని ఈ నెల 27న విడుదల చేస్తున్నట్లు అడివి శేష్ ప్రకటించాడు.
ఈ సినిమాలో శేష్ హీరో. ఆయన సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సానియల్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సుప్రియ యార్లగడ్డ సినిమాని నిర్మిస్తున్నారు.
ఈ మొదటి పాట రుబారు (Rubaroo)తో సినిమా ప్రచారం మొదలవుతుంది. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇటు తెలుగు, అటు హిందీలో పెద్ద ఎత్తున రిలీజ్ చెయ్యనున్నారు.
