
చేతికి కడియాలు, చెవులకు రింగులు, మెడలో పెద్దపెద్ద నగలు.. పెళ్లికూతురు ధగధగలాడిపోవడం కామన్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది పెళ్లికూతురు ముచ్చట కాదు. పెళ్లికొడుకు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ముచ్చట.
ఈరోజు రష్మికను పెళ్లి చేసుకున్న దేవరకొండ, డిఫరెంట్ గా ముస్తాబై పెళ్లి పీటలెక్కాడు. అతడు ధరించిన దుస్తులు, వేసుకున్న ఆభరణాలు అన్నీ ఇటు నార్త్-అటు సౌత్ మిక్స్ లో ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్టు ఈ దుస్తుల్లేవు. రాజుల కాలంలో బహుశా పెళ్లిళ్లు ఈ దుస్తుల్లోనే జరిగేవేమో అనేలా ఉన్నాయి.
Click Here: విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లి ఫోటోలు
ఈ సంగతి పక్కనపెడితే, విజయ్ దేవరకొండ దిగేసుకున్న నగలపై సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో, విజయ్ దేవరకొండ ఒంటిపై ఉన్నదంతా బంగారమేనా అనే చర్చ మొదలైంది.
చెవికి తగిలించిన ఆ రింగులు.. చేతికి కట్టిన కవచాల్లాంటి బ్రేస్ లెట్లు, మెడలో వేసిన భారీ నెక్లెస్.. ఇవన్నీ కలిపి ఎంత కాదనుకున్నా కనీసం 10 కిలోలైనా ఉంటుంది. దీంతో పెళ్లిలో విజయ్ దేవరకొండ కాస్తా బంగారు కొండలా కనిపించాడు. భారీ క్రేజ్, అదే స్థాయిలో పారితోషికం.. ఈమాత్రం ధగధగలు కామన్.
