
ఈ మధ్య డ్యాన్స్ మీద ఫోకస్ పడ్డట్లు కనిపిస్తోంది. రామ్ చరణ్ “చికిరి చికిరి” పాటలో వేసిన ఒక డ్యాన్స్ స్టెప్పు వైరల్ అయింది. దానికి పోటీగా అన్నట్లు మొదటిసారి నాని కూడా ఒక కష్టమైన స్టెప్పు వేశాడు. “ది ప్యారడైజ్” సినిమాలో “ఆయా షేర్” అనే పాటలో నాని వేసిన స్టెప్పు అదిరిపోయింది. ఆ పాట ఇప్పుడు సోషల్ మీడియాని ఊపేస్తోంది.
నానికి జవాబుగా అన్నట్లు మరోసారి రామ్ చరణ్ కొత్త డ్యాన్స్ స్టెప్పులతో మన ముందుకొచ్చాడు.
నిన్న రాత్రి పొద్దుపోయాక రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” సినిమా నుంచి రెండో పాట వచ్చింది. “రై రై రా రా” (Rai Rai Raa Raa) అనే పాటలో రామ్ చరణ్ మాస్ డ్యాన్స్ స్టెప్పులు, స్పీడ్ గా చేసిన షేక్ డ్యాన్స్ ని చూసి ఫ్యాన్స్ మెంటలెక్కిపోతున్నారు. ఏ ఆర్ రెహమాన్ స్వరపరచి పాడిన ఈ పాట మంచి ఊపుని తెచ్చింది. సినిమాపై అల్రెడీ ఉన్న హైప్ ని మరింత పెంచింది.
CHECK : Rai Rai Raa Raa: Ram Charan’s mass swag, Rahman’s solid beats
జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సినిమా ఇది. “పెద్ది” ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఇప్పటివరకు వచ్చిన రెండు పాటలు సినిమాకి ప్లస్ అయ్యేలా ఉన్నాయి. మంచి హైప్ ని తెచ్చాయి.
