
హీరోయిన్ దివి వడ్త్యా (Divi Vadthya) చాలా సినిమాల్లో నటించింది. కానీ ఆమె “పుష్ప 2″పై ఆమె ఎక్కువ ఆశలు పెట్టుకొంది. అందులో తనకి చాలా పెద్ద పాత్ర దక్కుతుంది అని భావించింది. కానీ సినిమాలో ఐదు నిముషాలు కూడా లేదు. అందుకే, చాలా డిసాపాయింట్ అయింది. ఆ విషయం ఇప్పుడు ఓపెన్ గా చెప్తోంది.
సుకుమార్ దర్శకత్వం వహించిన అల్లు అర్జున్ చిత్రం “పుష్ప 2” విడుదలకు చాలా నెలలకు ముందే ఒక టీజర్ ని విడుదల చేశారు. “పుష్ప” ఎక్కడ అంటూ దివి ఒక రిపోర్టర్ గా అందరినీ ప్రశ్నించే వీడియో అది. ఆమె ఈ పాత్ర సినిమా అంతా ఉంటుంది అని ఊహించుకుందట. కానీ తీరా సినిమా విడుదల తర్వాత సినిమా చివర్లో ఐదు నిమిషాలు కనిపించే రోల్ అని గ్రహించి బాధ పడిందిట.
సినిమా విడుదలైన రెండేళ్ల తర్వాత ఈ భామ ఇప్పుడు తన బాధని వెళ్లగక్కింది.
ప్రస్తుతం ఈ భామ ఎక్కువగా చిన్న చిత్రాల్లో కనిపిస్తోంది. అలాగే ఇన్ స్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటో షూట్లు చేస్తూ అలరిస్తూ ఉంటుంది.
