
జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నిన్న తన 29వ పుట్టిన రోజు జరుపుకొంది. తిరుమల కొండ మెట్లు ఎక్కి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొంది. ప్రతి పుట్టిన రోజుకి తిరుమలకి వెళ్లడం ఆమెకి ఇష్టం. గత రెండు పుట్టిన రోజులకు ఆమెతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ కూడా దర్శించుకున్నాడు. కానీ ఈసారి పిన్ని మహేశ్వరీ, ఇతర స్నేహితులతో ఆమె దర్శనం చేసుకొంది.
ఐతే, జాన్వీ పెళ్లి వాయిదా పడింది అనే టాక్ తాజాగా మొదలయింది. 2026లో ఆమె పెళ్లి ఉంటుంది అని ఆ మధ్య ఆమె తండ్రి బోనీ కపూర్ హింట్ ఇచ్చారు. అలాగే ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ కూడా అలాగే హడావిడి చేశాడు. ఇద్దరూ కలిసి గత రెండేళ్లలో అనేక గుళ్ళు తిరిగారు, ప్రత్యేకంగా పూజలు చేశారు. దాంతో పెళ్ళి కోసం, ఎదో దోష నివారణ కోసం పూజలు చేస్తున్నారు అనే టాక్ నడిచింది.
ఐతే తాజా సమాచారం ప్రకారం 30 దాటిన తరవాతే జాన్వీ కపూర్ పెళ్లి చేసుకుంటుంది అని అంటున్నారు. అంటే మరో ఏడాది ఆగాల్సిందే.
ప్రస్తుతం ఆమె కెరీర్ బాగుంది. తెలుగులో “పెద్ది” సినిమాలో నటిస్తోంది. అలాగే “దేవర 2″లో కూడా నటించనుంది. అల్లు అర్జున్ సినిమాలో కూడా ఆమె నటించనుంది అనే టాక్ నడుస్తోంది.
