
Kayadu Lohar’s second innings in Telugu: ఫంకీ (Funky) సినిమా విడుదలైంది, చాలా నెగెటివ్ కామెంట్స్ తెచ్చుకొంది. రివ్యూస్ కూడా బాగా నెగెటివ్ గా వచ్చాయి. కలెక్షన్లు చాలా డల్ గా ఉన్నాయి. హీరో విశ్వక్ సేన్ కి ఇది ఏ విధంగానూ హెల్ప్ కాదు. కానీ హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) కి మంచి మార్కులు పడ్డాయి.
ఈ పిల్ల అక్కటుకొంది. ఆమెకి ఇది మొదటి తెలుగు చిత్రం కాదు. కానీ ఆమె నాలుగేళ్ల క్రితం నటించిన మొదటి తెలుగు చిత్రం “అల్లూరి” ఎవరికీ గుర్తులేదు. ఆ సినిమా ఆడకపోతే ఆమెని ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఆమె తమిళ సినిమా రంగంలోకి అడుగుపెట్టి అక్కడ బాగా క్రేజ్ తెచ్చుకొంది. ప్రదీప్ రంగనాథన్ సరసన “డ్రాగన్” చిత్రంలో నటించి యువతని ఆకట్టుకొంది. దాంతో మళ్ళీ తెలుగు నిర్మాతలు ఆమెని సైన్ చేశారు.
అలా ఆమె రెండో తెలుగు చిత్రం…ఫంకీ ఇప్పుడు థియేటర్లలోకి వచ్చింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా ఆమెకి మాత్రం ఈ సినిమా హెల్ప్ అవుతుంది. అమ్మాయి అందంగా ఉంది అని పేరు తెచ్చుకొంది.
ప్రస్తుతం ఈ భామ నాని సరసన “ది ప్యారడైజ్”లో నటిస్తోంది. ఇంకా మూడు తమిళ చిత్రాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఆమెని అనేక సినిమాల్లో చూస్తాం.
