
మమిత బైజు (Mamitha Baiju) పుట్టింది, పెరిగింది కేరళలో. ఆమె మలయాళ చిత్రాలతోనే మొదట గుర్తింపు తెచ్చుకొంది. కానీ ఇప్పుడు మొత్తంగా తమిళ సినిమా రంగంలో బిజీ అవుతోంది. ఇప్పటికే ప్రదీప్ రంగనాథం సరసన “డ్యూడ్” సినిమా చేసింది.
తమిళ అగ్రహీరోలు సూర్య, ధనుష్ లతో నటిస్తోంది. మరో రెండు కొత్త తమిళ సినిమాలు లైన్లో ఉన్నాయి. “కారా” పేరుతో ధనుష్ సరసన నటించిన చిత్రం ఈ సమ్మర్లోనే విడుదల కానుంది. ఇక సూర్య సరసన నటిస్తోన్న తమిళ – తెలుగు ద్విభాషా చిత్రం “విశ్వనాధ్ అండ్ షన్స్” జులైలో విడుదల అవుతుంది.
ఈ రెండు సినిమాలతో ఆమె ఇప్పటి వరకు సైన్ చేసిన తమిళ సినిమాల లిస్ట్ పూర్తి అవుతుంది. తాజాగా ఆమె మరో తమిళ నటుడు సూరి కొత్త చిత్రంలో నటించే అవకాశం కనిపిస్తోంది. ఈ లెక్కన చూస్తే ఆమె పూర్తిగా తమిళ చిత్రరంగంలోనే టాప్ కి వెళ్లేలా ఉంది.
ఈ భామకి 24 ఏళ్ళు. ఇప్పటికే చాలా పేరు తెచ్చుకొంది. మలయాళంలో చాలా సినిమాలు చేసింది కానీ తమిళంలోనే ఎక్కువ సైన్ అవుతోంది.
