
బైకర్ సినిమాలో శర్వానంద్ కి తండ్రిగా నటించి ఒక కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు ఒకప్పటి కథానాయకుడు డా. రాజశేఖర్ (Rajasekhar). ఇప్పుడు తన కేరీర్ కొత్త మలుపు తీసుకొంది అని అంటున్నారు.
ఇకపై తండ్రి పాత్రలు, క్యారెక్టర్ రోల్స్ ఎక్కువగా చేస్తాను అంటున్నారు.
పాలిటిక్స్ నుంచి సినిమాల వరకు అనేక విషయాలు తాజాగా మీడియాతో పంచుకున్నారు.
- “జీవిత లేకపోతే మాకు జీవితమే లేనట్టే. అందుకే ఆమె మళ్లీ నటించాలని నేను కోరుకోవడం లేదు. ఆమె నాతో, నా పిల్లలతో ఎప్పుడూ వెంటే ఉండాలి.”
- “మెగాస్టార్ చిరంజీవి గారితో ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదు. ఆయన సినిమాలో అవకాశం వస్తే తప్పకుండా నటిస్తాను.”
- “క్యారెక్టర్ బాగుంటే ఏ హీరోకైనా తండ్రి పాత్ర చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.”
- “నా పాత సినిమాల్లో “అల్లరి ప్రియుడు”ను మళ్లీ రీ-రిలీజ్ చేస్తే బాగుంటుంది.”
- ““డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి, ఎక్కువ సినిమాలు చేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఇలా మారాను.”
- “ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.”
- “నాకు పాలిటిక్స్ అంటే ఇష్టం. కానీ నా భార్య జీవిత బాగా మాట్లాడుతుంది కాబట్టి ఆమెకు మంచి పేరు వచ్చింది.”
