
అల్లు అర్జున్ (Allu Arjun), డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం “రాకా” (Raaka) ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు వైవిధ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఒక పాత్ర లుక్ ని ఇప్పటికే అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ లుక్, దాని ఇంటెన్సిటీ కోసం అల్లు అర్జున్ ఎంతగానో శ్రమించారట
అల్లు అర్జున్ ప్రతీ రోజూ మూడు నుంచి నాలుగు గంటల పాటు ఈ లుక్ కోసం రెడీ అయి షూటింగ్ లో పాల్గొంటున్నారట.
పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో సాధించిన విజయం తర్వాత అల్లు అర్జున్ తన సినిమాలకు సంబంధించి మరింత కేర్ తీసుకుంటున్నారు. మునుపటి కన్నా ఎక్కువ కష్టపడుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో తన స్టార్డం మరింత పెంచుకునేలా ప్రయత్నం చేస్తున్నారు.
అల్లు అర్జున్ నటిస్తున్న “రాకా” (Raaka) వచ్చే ఏడాది విడుదల కానుంది. ప్రస్తుతం పూర్తిగా ఈ సినిమాపైనే ఫోకస్ పెట్టారు.
