
శర్వానంద్ కి లక్ తిరిగింది. చాలా రోజుల తర్వాత ఒక విజయం దక్కింది. ఐదు సినిమాలు పోటీలో ఉన్నా శర్వానంద్ నటించిన సినిమాకి దక్కాల్సిన సక్సెస్ వచ్చి చేరింది. “నారి నారి నడుమ మురారి” చిత్రం మంచి కలెక్షన్లు పొందింది. టాక్ బాగుంది. ఈ సినిమాని బాక్సాఫీస్ వద్ద నిలబెట్టేందుకు శర్వానంద్ రంగంలోకి దిగి గట్టిగా ప్రచారం చేస్తున్నాడు.
ఇదంతా బానే ఉంది కానీ ఇకపై శర్వానంద్ సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. కెరీర్ విషయంలో చాలా బద్దకము చూపాడు ఇప్పటివరకు. గత మూడేళ్లల్లో శర్వానంద్ కేవలం రెండే సినిమాలు విడుదల చేశాడు. ఇకపై అలా ఉంటే కుదరదు. అన్నీసార్లు సంక్రాంతి పండుగకు సినిమాని తెస్తాను అంటే కూడా సాధ్యం కాదు. అందుకే తన సినిమాలను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి, స్పీడ్ గా సినిమాలు పూర్తి చేసి విడుదల చెయ్యాలి.
ఐతే, ఇప్పటికే మంచి ప్లాన్ రెడీ చేశాడు. ఈ ఏడాది వేసవిలో “బైకర్” సినిమా విడుదల చేయనున్నాడు. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే కథ. సినిమా షూటింగ్ పూర్తి అయింది.
ఈ ఏడాదిలోనే “భోగి” అనే సినిమా తీసుకొస్తాడట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకొంది. సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది విడుదలైతే 2026లో మూడు సినిమాలు విడుదల చేసినట్లు అవుతుంది.
ఇక 2027 సంక్రాంతికి శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందే కొత్త సినిమాని విడుదల చెయ్యాలనుకుంటున్నాడు. మొత్తానికి దూకుడు మొదలుపెడుతున్నాడు.
