
తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఇప్పటికే 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసింది. ఇకపై ఆమెకి హీరోయిన్ గా పెద్దగా అవకాశాలు రావు. ప్రస్తుతం ఐటెం సాంగ్స్ ఎక్కువగా దక్కుతున్నాయి. ఇక హీరోయిన్ గా దక్కుతున్న సినిమాలు కూడా పెద్ద హీరోలవి కావు. అందుకే, తర్వాతి కాలంలో ఆదాయం మంచిగా ఉండేలా జాగ్రత్త పడుతోంది.
నిజం చెప్పాలంటే ఆమె బాలీవుడ్ కెరీర్ బేషుగ్గా ఉంది. దాదాపు అరడజను ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. ఐటెం సాంగుల్లో కనిపించినా ఐదు కోట్లు తీసుకుంటోంది. అంటే సంపాదన పరంగా ఆమెకి ఇప్పటికిప్పుడు వచ్చినా సమస్య లేదు. కానీ ఆమె ఆలోచన అంతా లాంగ్ రన్ లో తనకి ఢోకా ఉండొద్దు అని.
ఆమె ఇప్పటికే బంగారు నగల వ్యాపారంలోకి అడుగుపెట్టింది. దాన్ని ఇప్పుడు బాగా ప్రమోట్ చేస్తోంది. అలాగే ముంబైలో అపార్ట్మెంట్ లు తెగ కొనేస్తోంది. ఇప్పుడు సంపాదిస్తోన్న డబ్బు అంతా ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేస్తోంది.
హీరోయిన్లకు ఎక్కువ కాలం సంపాదించే శక్తి ఉండదు అని ఆమె ఆమెకి తెలుసు. అందుకే, తన పెళ్లికి ముందే ఆల్ట్రనేటివ్ ఇన్కమ్ వచ్చే మార్గాలు సెట్ చేసుకొంది. ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు.
