
Divi Vadthya: హీరోయిన్లు బికినీలు వేసుకోవడం సాధారణమే. కానీ సినిమాల్లో సైడ్ రోల్స్ చేసేవాళ్ళు, చిన్న హీరోయిన్లు బికినీలతో కనిపించేందుకు ఆసక్తి చూపరు. కానీ గ్లామర్ ని నమ్ముకున్న దివి మాత్రం ఆ మధ్య బికినీ ఫోటోలు షేర్ చేసి అందరి అటెన్షన్ అందుకొంది.
తాజాగా ఆమె తన గ్లామర్ షో గురించి, సినిమాల్లో హాట్ హాట్ సీన్లు చెయ్యడం గురించి, తన పారితోషికం గురించి మాట్లాడింది. ఆమె తాజాగా నవీన్ చంద్ర సరసన నటించింది. “హనీ” అనే ఈ చిత్రం ఈ వారం విడుదల కానుంది. ఇందులో కొంచెం హాట్ హాట్ సీన్లు చేసింది.
ఈ సినిమా పాత్ర ఒప్పుకోవడానికి, ఇలా హాట్ సీన్లు చెయ్యడానికి కారణం గట్టిగా పారితోషికం ఇవ్వడమేనా అన్న ప్రశ్నకు సమాధానం దొరికింది. “దర్శకుడు కరుణ కుమార్ సినిమాలు ఇష్టం. పలాస టైం నుంచే ఆయన డైరెక్షన్లో నటించాలని అనుకున్నాను. ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ కారణం అదే. ఇక పారితోషికం బాగానే ఇచ్చారు కానీ పాత్ర, దర్శకుడు వల్లే సినిమా ఒప్పుకున్నాను,” అని ఈ భామ తెలిపింది.
బికినీ షో గురించి అడిగితే నవ్వింది. ప్రత్యేకంగా సమాధానం ఇవ్వలేదు. ఆ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ నుంచి ఎందుకు తొలగించింది అన్న విషయం కూడా క్లారిటీ ఇవ్వలేదు.

ఆమె నిత్యం షేర్ చేసే గ్లామర్ ఫోటోల వల్లే ఈ భామకు ఇన్ స్టాగ్రామ్ లో పాపులారిటీ వచ్చింది. “పుష్ప” వంటి సినిమాల్లో సైడ్ రోల్స్ చేసిన దివ్య అడపాదడపా ఇలా లీడ్ రోల్స్ కూడా దక్కించుకుంటోంది.
