
Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు ప్రతి సినిమాలో మరో హీరోతో అతిథి పాత్రలు చేయిస్తున్నారు. “జైలర్” సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్స్ నటించారు. “వేటక్కారన్” చిత్రంలో ఫహద్ ఫాజిల్ నటించాడు. “కూలీ” సినిమాలో ఉపేంద్ర, అమీర్ ఖాన్ వంటి పెద్ద స్టార్స్ అతిథి పాత్రల్లో, నాగార్జున విలన్ గా కనిపించారు.
ఇప్పుడు “జైలర్ 2″లో కూడా అదే రిపీట్ కానుంది. ఈ సినిమాలో షారుక్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపిస్తారట. ఇప్పటికే షారుక్ ఖాన్ అంగీకరించినట్లు టాక్.
ఇప్పటికే రజినీకాంత్ కి సంబందించిన అన్ని సన్నివేశాలను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ చిత్రీకరించారు. ఇక షారుక్ ఖాన్ సోలో సన్నివేశాలు, అలాగే షారుక్, రజినీకాంత్ మధ్య సీన్లను తీయాలి.
త్వరలోనే షారుక్ డేట్స్ తీసుకొని ముంబైలోనే ఈ సీన్లు తీసేలా ప్లాన్ చేస్తున్నారు. “జైలర్” అన్ని భాషల్లో హిట్ అయింది. “జైలర్ 2″కి హిందీ మార్కెట్ లో మరింత క్రేజ్ తెచ్చేలా ఇలా ప్లాన్ చేశారు.
ప్రస్తుతం షారుక్ ఖాన్ హిందీలో “కింగ్” సినిమాలో నటిస్తున్నారు. ఇది డిసెంబర్ లో విడుదల కానుంది. ఇక “జైలర్ 2” జూన్లో విడుదల అవుతుంది.
