
కియరా అద్వానీ (Kiara Advani) మళ్ళీ సినిమాలు ఒప్పుకుంటోంది. గత ఏడాది ఒక బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా బయటికి వస్తోంది. ఇప్పుడు కొంచెం సన్నబడింది. ప్రెగ్నన్సీ తర్వాత ఉండే బరువుని తగ్గించుకునే ప్రయత్నంలో ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో స్లిమ్ అవుతాను అని కాన్ఫిడెంట్ గా చెప్తోంది.
తాజాగా ఆమె ముంబైలో ఒక ఈవెంట్ కోసం బయటికి వచ్చింది.
ఈ ఏడాది ఆమె నటించిన టాక్సిక్ విడుదల కానుంది. వచ్చే నెలలోనే ఈ సినిమా రిలీజ్. ఈ సినిమా ప్రమోషన్స్ తో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఇక “డాన్ 3” సినిమా ఆమెకి మిస్ అయ్యేలా ఉంది. ఈ సినిమాలో రణ్వీర్ సింగ్, కియరా అద్వానీ తీసుకున్నారు. కానీ “ధురంధర్” సక్సెస్ తర్వాత రణ్వీర్ సింగ్ “డాన్ 3” చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆ సినిమాకి హీరో దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు.
ఐతే, తెలుగులో, హిందీలో కొత్త సినిమాల ఆఫర్లు వస్తున్నాయి. అవి సైన్ చేస్తాను అంటోంది. మునుపటి కన్నా జోరుగా సినిమాలు చేస్తుందట.
