
సిరి హనుమంత్ బిగ్ బాస్ వంటి షోలతో పాపులర్ అయింది. ఈ అమ్మడు వయసు చాలా తక్కువ. చిన్న హీరోల సరసన హీరోయిన్ గా నటించొచ్చు. అలాంటి భామ ఒక 60 ప్లస్ సీనియర్ హీరోకి పెళ్ళాంగా నటించడం చాలా విచిత్రం.
సిరి హనుమంత్ అలాంటి డేరింగ్ నిర్ణయం తీసుకొంది. ఐతే లక్కీగా ఆమెకి ఈ నిర్ణయం కలిసొచ్చింది.
“నారి నారి నడుమ మురారి” సినిమాలో ఆమె సీనియర్ నటుడు నరేష్ కి రెండో భార్యగా నటించింది. భార్య చనిపోతే లేట్ వయసులో యంగ్ భామని పెళ్ళాడి ఆమెతో పిల్లలు కనే పాత్రలో నటించాడు నరేష్. సిరి హనుమంతు అలాంటి పాత్రకి ఒప్పుకోవడం డేరింగ్ అని చెప్పాలి. సాధారణంగా ఆమెలాంటి వాళ్ళు ఒక సీనియర్ హీరో సరసన నటించేందుకు ఒప్పుకోరు. పైగా శర్వానంద్ వంటి హీరోకి పిన్ని పాత్రకి అస్సలు అంగీకరించరు.
శర్వానంద్ కంటే ఆమె వయసులో చాలా చిన్న. ఐతే, పాత్ర, తన పాత్ర చుట్టూ ఉండే కామెడీ నచ్చి ఈ అమ్మడు ఒప్పుకొంది. ఈ సినిమా హిట్ కావడంతో నటిగా తనకు ఒక సక్సెస్ వచ్చింది అనే ఆనందంలో ఉంది.
