
రవితేజకి ఇటీవల అన్నీ ఫ్లాపులే. ఇలాంటి టైంలో విడుదలైంది భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఇందులో యాక్షన్ సన్నివేశాలు లేవు. మాస్ ఎలివేషన్స్ లేవు. విలన్ కూడా లేడు.
భార్యాభర్తల సమస్య, మధ్యలో లవర్ గోల. అటు భార్య, ఇటు లవర్ మధ్య నలిగిపోయే పాత్ర తాను ఇంతకుముందు చెయ్యలేదు, ఇప్పుడు చేశాను అని అనందంగా చెప్తున్నారు రవితేజ. ఇలాంటి సినిమా చెయ్యాలని ఎప్పుడో అనుకున్నాడట రవితేజ. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో గతంలో ప్లాన్ చేశారట. కానీ అప్పుడు వర్కవుట్ కాలేదు.
అన్ని మాస్ సినిమాలు, యాక్షన్ సినిమాలు చేస్తూ వస్తున్న రవితేజకి ఇది రిలీఫ్. అన్ని సంక్రాంతి సినిమాల మధ్య దీనికి రావాల్సినంత కలెక్షన్లు రాలేదు. కానీ రవితేజ సినిమాకి పాజిటివ్ టాక్ రావడం ఈ మూడు, నాలుగు ఏళ్ళల్లో ఇదే మొదటిసారి.
అందుకే రవితేజ అనందంగా ఉన్నాడు. కలెక్షన్ల కన్నా టాక్ బాగుండడం ఆయనకి హ్యాపీగా ఉంది.
ఇకపై అన్ని రకాల సినిమాలు చేసే కాన్ఫిడెన్స్ ఈ సినిమా తెచ్చింది అని రవితేజ అంటున్నాడు. ఇకపై కేవలం మాస్ సినిమాలు మాత్రం చెయ్యదంట. రవితేజ ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు.
