విష్ణు ఏకగ్రీవం అంటోన్న మా ‘కమిటీ’

“జాతిరత్నాలు” సినిమాలో ఒక సీన్ ఉంది. జడ్జి పాత్ర పోషించిన బ్రహ్మానందం లాయర్ పాత్ర పోషించిన హీరోయిన్ ని ఉద్దేశించి…లాయర్ అడిగారు కదా ఇచ్చేయండి బెయిల్ అని సెటైర్ వేస్తారు. అన్ని మీరే చేసుకుంటే ఇక మేము ఎందుకు అని ఈసడించుకుంటారు. అలా ఉంది “మా” (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) కమిటీ తీరు.

రెండేళ్ల క్రితం ఎన్నికయిన “మా” కమిటీ ఈ రోజు సమావేశం అయింది. ఈ కమిటీలోని 26 మంది సభ్యులు ‘మా” అధ్యక్షుడు మంచు విష్ణు “పని తీరు”ని మెచ్చుకొని మరోసారి అతన్నే అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నట్లు ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఎన్నికలకు వెళ్లకుండా వాళ్లకు వాళ్ళే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకొని విష్ణు ఇంకో రెండేళ్లు అధ్యక్షుడిగా కొనసాగాలని తీర్మానించారు.

గత ఎన్నికల సమయంలో మంచు విష్ణు “మా” కోసం బిల్డింగ్ కట్టిస్తాను అని హామీ ఇచ్చాడు. భూమి కూడా చూసి పెట్టాను అని బిల్డప్ ఇచ్చుకున్నాడు. కానీ ఇంతవరకు దానికి సంబంధించి అతీగతీ లేదు ఇప్పటివరకు. అయినా ఈ కమిటీ ఆయన పనితీరు బాగుందని, మా బిల్డింగ్ అయ్యేంతవరకు మరో రెండేళ్లు విష్ణు అధ్యక్షుడిగా ఉండాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది.

మరి దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఎవరైనా కోర్టుకు వెళ్తారా లేదా అన్నది చూడాలి.

మంచు విష్ణు, మా, మా అధ్యక్షుడు, మా కమిటీ,

 

More

Related Stories