
తమిళ సినిమా రంగంలో గొప్ప దర్శకులలో ఒకరు భారతీరాజా (Bharathiraja). తమిళ్ లో ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. అవి తెలుగులో కూడా డబ్ అయ్యాయి, రీమేక్ అయ్యాయి. అలాగే ఆయన స్వయంగా తెలుగులోనూ సినిమాలు తీశారు.
16 ఏళ్ల వయసు, తూర్పు వెళ్లే రైలు వంటి సినిమాలను ఆయన తమిళ్ లో తీశారు. తెలుగులో సీతాకోకచిలుక, ఆరాధన వంటి సినిమాలు డైరెక్ట్ చేశారు.
రాధిక, రేవతి, రాధ, విజయశాంతి, ముచ్చర్ల అరుణ, వంటి హీరోయిన్లను ఆయనే పరిచయం చేశారు. ఇక హీరోలలో సుధాకర్ (కమెడియన్), కార్తీక్, భాగ్యరాజా వంటి వారిని స్టార్లుగా మలిచారు.
నాలుగు నెలల క్రితం ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరిన ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నటి రాధిక (Radhika) ఆయనను కలసి పరామర్శించారు. ఈ సందర్బంగా భావోద్వేగానికి లోనైన ఆమె, ఒక వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇన్స్టాగ్రామ్లో భారతీరాజాతో మాట్లాడుతున్న వీడియోను షేర్ చేసిన రాధిక, “ఆయన ఆశీర్వాదం అవార్డు కంటే గొప్పది. ఆయనను ఈ స్థితిలో చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. చాలా బాధగా ఉంది. అయినా కూడా సినిమాపై ఆయనకున్న ప్రేమే ఆయనను ముందుకు నడిపిస్తోంది” అంటూ రాసుకొచ్చారు.
