
ఎన్టీఆర్ (NTR), రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) జంటగా నటిస్తున్నారు. “కాంతార 2” చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న రుక్మిణి ఎన్టీఆర్ తో నటించడం ఇదే మొదటిసారి. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం(#NTRNeel) షూటింగ్ త్వరలోనే హైదరాబాద్ లో మొదలుకానుంది. ఈ రోజు హైదరాబాద్ విచ్చేసింది రుక్మిణి.
ఎయిర్ పోర్ట్ వద్ద రుక్మిణి ఫోటోలను, వీడియోలని పాపారాజి బంధించింది. ఈ వీడియోల్లో ఆమె చాలా బొద్దుగా కనిపిస్తోంది. రుక్మిణి మొదటి నుంచి కొంచెం చబ్బీనే. ఇప్పుడు మరింత బొద్దుగా అయింది.
దాంతో, “తారక్ సన్నబడితే రుక్కు లావెక్కుతోంది,” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.
ఈ సినిమా కోసం ఎన్టీయార్ చాలా బరువు తగ్గిన విషయం అందరికీ తెలుసు. గతంలో చాలా లావుగా ఉండే ఎన్టీఆర్ కాలక్రమేణా చాలా సన్నబడ్డారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం మరీ తగ్గిపోయారు. అందుకే రుక్మిణిపై ఇలా కామెంట్స్ పడుతున్నాయి.
