
తమన్నా భాటియా తన బాయ్ ఫ్రెండ్, హీరో విజయ్ వర్మతో బ్రేకప్ చెప్పుకున్న తర్వాత కసిగా సినిమాలు సైన్ చేస్తోంది. అంతేకాదు ఫిట్నెస్ విషయంలో కూడా కష్టపడుతోంది. తాజాగా ఎల్లే మ్యాగజైన్ కి సంబందించిన 2026 లిస్ట్ కి సంబంధించిన ఈవెంట్ కి ఆమె హాజరయి, మెస్మరైజ్ చేసింది.
ఆమె మునుపటి కన్నా మరింత అందంగా, స్టయిలీష్ గా కనిపిస్తోంది. దాంతో, ఆమె ఫోటోలు చాలా వేగంగా వైరల్ అయ్యాయి.
ఇక బాలీవుడ్ లో కూడా ఆమె కెరీర్ సూపర్ గా సాగుతోంది. ఇప్పటికే ఆమె ఐటెం గర్ల్ గా బాలీవుడ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు దాదాపు ఒక అరడజను బడా చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేస్తోంది. ప్రత్యేక గీతాల్లోనూ దర్శనం ఇవ్వనుంది.
తమన్నకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు కానీ బాలీవుడ్ లో మాత్రం ఆమెకి క్రేజ్, డిమాండు ఎక్కువగా ఉంది. ఆమె డ్యాన్స్ లు హిందీ ప్రేక్షకులను మతి పోగొడుతున్నాయి. తెలుగు వాళ్లకు ఆమె సూపర్ డ్యాన్సర్ అని తెలుసు. కానీ నార్త్ వాళ్లకు ఇటీవలే తెలిసింది. అందుకే ఆమె పాటలకు, డ్యాన్సులకు యమా క్రేజ్ పెరిగింది.

మొత్తమ్మీద ఈ భామ పెళ్లి, ప్రేమ విషయాలు పక్కన పెట్టి కెరీర్ పై ఫోకస్ పెట్టింది. స్టయిల్, హాట్ విషయంలో అదరగొడుతోంది.
