
Swayambhu: నిఖిల్ హీరోగా నటిస్తున్న రెండు సినిమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తాను అని ఇటీవలే నిఖిల్ ప్రకటించాడు. అలా చెప్పి తన “స్వయంభు” సినిమాని ఫిబ్రవరి 13న విడుదల చెయ్యనున్నట్లు అనౌన్స్ చేశాడు. కానీ సినిమా విడుదలకు సరిగ్గా 20 రోజుల టైం ఉంది. ఇప్పుడు అసలు విషయం బయటికి వచ్చింది.
“స్వయంభు” ఫిబ్రవరి 13న రావడం లేదు. మరో కొత్త డేట్ కోసం టీం చూస్తోంది. అంటే ఈ సినిమా కూడా మరోసారి వాయిదా పడింది.
నిఖిల్ సిద్ధార్థ ఇలా తన సినిమాలను వాయిదా వేస్తూ పోతుంటే చాలా రకాల కామెంట్స్ వస్తున్నాయి. ఐతే, నిఖిల్ ఇవి పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఎందుకంటే క్వాలిటీతో సినిమాలను విడుదల చెయ్యకపోతే అస్సలుకే మోసం వస్తుంది. ఇప్పటికే నిఖిల్ రెండు సినిమాలు దారుణంగా పరాజయం పాలు అయ్యాయి.
“కార్తికేయ 2” సినిమా తెలుగుతో పాటు హిందీలో బాగా ఆడింది. మరి పాన్ ఇండియా సక్సెస్ కావాలంటే క్వాలిటీ కావాలి కదా.
