Skip to content
Telugu Cinema తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

  • హోం
  • న్యూస్
  • అవీ ఇవీ
  • ఫీచర్లు
  • ఇంటర్వ్యూలు
  • రివ్యూలు
  • ఫోటోలు
  • English
Telugu Cinema
తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

Senior stars: ఒకప్పటి హీరోలు ఇప్పుడు ప్రత్యేక పాత్రల్లో

TeluguCinema, May 23, 2026May 23, 2026

ఒకప్పుడు వెండితెరపై హీరోలుగా వెలిగిన వారు ఇప్పుడు రూటు మార్చుతున్నారు. సీనియర్ స్టార్స్ (Senior Stars) హీరో పాత్రలకే పరిమితం కాకుండా, విలన్ పాత్రలు, క్యారెక్టర్ రోల్స్, ప్రత్యేక పాత్రలకు సై అంటున్నారు. ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్‌లో బలంగా కనిపిస్తోంది.

అక్కినేని నాగార్జున “కూలీ” సినిమాలో విలన్ గా నటించారు. కమల్ హాసన్ “కల్కి 2” సినిమాలో ప్రస్తుతం విలన్ గా నటిస్తున్నారు. షూటింగ్ మొదలైంది. మోహన్ లాల్ హీరోగా నటిస్తూనే గెస్ట్ రోల్స్ చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మేన్ అనిపించుకున్న రాజశేఖర్ తండ్రి పాత్రలోకి వచ్చారు. ఇటీవల శర్వానంద్ కి తండ్రిగా “బైకర్” చిత్రంలో మెప్పించారు.

మోహన్ బాబు, జగపతిబాబు, శ్రీకాంత్ వంటి ఒక్కప్పటి స్టార్స్ ఇప్పటికే క్యారెక్టర్ రోల్స్‌లో బిజీ అయ్యారు. జగపతిబాబు ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరు. శ్రీకాంత్ కూడా హీరో నుంచి విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి మరింత బిజీ అయ్యారని చెప్పాలి. ఇక మోహన్ బాబు ప్రస్తుతం నాని హీరోగా నటిసున్న “ది ప్యారడైజ్ చిత్రం”లో విలన్ గా నటిస్తున్నారు.

మంచు మనోజ్ ‘భైరవం’, ‘మిరాయి’ సినిమాలతో విలన్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మెప్పించాడు. నారా రోహిత్ కూడా కీలక పాత్రలకు ఓకే చెబుతున్నాడు. సత్యదేవ్ హీరోగానే కాకుండా ‘కింగ్డమ్’ లాంటి సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. వెంకటేష్ అయితే చాలా కాలం క్రితమే మల్టీస్టారర్, ప్రత్యేక పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, ఇటీవల “మన శంకర వరప్రసాద్ గారు” చిత్రంలో కూడా స్పెషల్ రోల్ చేశారు. తాజాగా కళ్యాణ్ రామ్ తో కలిసి మల్టిస్టారర్ చేస్తున్నారు.

ఇక కన్నడ నటులు ఉపేంద్ర, శివరాజ్ కుమార్ కూడా టాలీవుడ్‌లో కీలక పాత్రలు చేస్తున్నారు. ఉపేంద్ర ‘ఆంధ్రా కింగ్ తాలూక’లో ముఖ్య పాత్ర పోషించగా, త్వరలో విడుదల కానున్న “పెద్ది” చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు

మొత్తానికి హీరోలుగా వెలిగిన చాలామంది నటులు ఇప్పుడు కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ, తమ కెరీర్‌కు కొత్త దిశను ఇస్తున్నారు.

Post navigation

Previous post
Next post

ఇవీ చదవండి

  • Eesha Rebba
    Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Aamir Khan wit Gauri Spratt
    Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • GV Prakash Kumar
    తెలుగులో బిజీ అవుతోన్న GV Prakash Kumar
  • Nani
    Nani: ఆ వార్త తప్పు అని వివరణ
  • Sushmita Sen
    Sushmita Sen తన డబ్బులు తీసుకోలేదంటున్న లలిత్
  • Gunasekhar
    హీరోల కోసం కథలు రాయొద్దు : Gunasekhar
  • Regina Cassandra adopts a horse
    Regina Cassandra: గుర్రాన్ని దత్తత తీసుకున్న సుందరి
  • Varun Tej
    Varun Tej: గాయం నుంచి కోలుకున్నాడు
  • Peddi
    Peddi: హిందీ ఓపెనింగ్ కీలకం!
  • Boxoffice: 2026 మే నెల మొత్తం ఖాళీ
  • Vijay Deverakonda: ఎందుకు ఇంత దూకుడు?
  • Avika Gor
    Avika Gor: ఈ ఫొటోల వెనక ఆంతర్యమేంటి?
  • Anasuya
    Anasuya: సూపర్ స్టార్ సినిమాలో ఈ భామ
  • Eesha Rebba
    Eesha Rebba: ఫొటోలేనా? పెళ్లి కబురు లేదా?

Recent News

  • Eesha Rebba: స్పెషల్ కంటెంట్ ఇస్తుందంట
  • Allu Arjun: AA23 సినిమా ఆగిపోలేదు
  • Venkatesh: ఈసారి మరో డిఫరెంట్ టైటిల్?
  • Aamir Khan: జులై 5న మూడో పెళ్లి!
  • Vijay Antony: జూన్ 19న ‘వంద దేవుళ్ళు’
©2026 తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్ | WordPress Theme by SuperbThemes