
పెళ్లి తర్వాత తొలిసారి సోషల్ మీడియాలో స్పందించాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas.) తన పెళ్లి ఫొటోల్ని షేర్ చేస్తూనే, దానికి అందమైన కంటెంట్ కూడా తగిలించాడు. ఈ క్రమంలో అతడు వాడిన ఓ డైలాగ్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. “నా పెళ్లాం నిప్పురా” (Naa Pellam Nippu Ra) అనేది బెల్లంకొండ పోస్టులో పంచ్ లైన్.
ఈ క్యాప్షన్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. “నిప్పుతో పెట్టుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి”, “జాగ్రత్త బ్రో.. కాలిపోతావు” అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది అభిమానులు ఈ జంట చూడముచ్చటగా ఉందని ప్రశంసిస్తుంటే, మరికొందరు మాత్రం ఆ క్యాప్షన్‌ను పట్టుకుని సెటైర్లు వేస్తున్నారు.
సాయి శ్రీనివాస్ తన వ్యక్తిగత విషయాలను అప్పుడప్పుడు ఇలా షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటాడు. ముఖ్యంగా తన భార్యపై ఉన్న ప్రేమని ఈ విధంగా వెరైటీగా వ్యక్ తపరచడంతో మరోసారి వైరల్ గా మారాడు.
సెలబ్రిటీల పోస్ట్‌లకు ఇలాంటి వింతైన రియాక్షన్లు రావడం సహజమే అయినా, ఈ ‘ఫైర్’ కామెంట్ మాత్రం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది.
తిరుమలలో శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకున్నాడు బెల్లంకొండ. ఆ తర్వాత హైదరాబాద్ లో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటుచేశారు. ఈ రిసెప్షన్ తో బెల్లంకొండ-కావ్య వివాహ వేడుకలు ముగిశాయి. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన ఈ హీరో, కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటాడా.. విజయ్ దేవరకొండ తరహాలో వెంటనే సినిమాల్లో జాయిన్ అవుతాడా అనేది చూడాలి.
