
ప్రముఖ నటి అవికా గోర్ (Avika Gor) తన భర్త మిలింద్ చంద్వానీతో కలిసి థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ (Bangkok)కు శాశ్వతంగా మకాం మార్చింది. దీనికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. భర్త మిలింద్ కు అక్కడ మెరుగైన అవకాశాలున్నాయంట. అందుకే భర్త కోసం ఇండియా వదిలి బ్యాంకాంక్ లో సెటిల్ అవ్వబోతోంది అవికా.
ఇప్పటికే బ్యాంకాంక్ లో ఈ దంపతులు ఇల్లు కొనుక్కున్నారు. కొనుగోలు చేసిన ఇంటిలో ఇంటీరియల్ వర్క్ జరుగుతోంది. తన అభిరుచికి తగ్గట్టు ఇంటిని సిద్ధం చేసుకుంటున్నట్టు అవికా వెల్లడించింది.
బ్యాంకాక్ లో సెటిలైనప్పటికీ తన సినీ కెరీర్ ను కొనసాగిస్తానంటోంది అవికా. షూటింగ్స్ కోసం బ్యాంకాక్ నుండి ఇండియాకు రావడం పెద్ద సమస్య కాదని చెబుతోంది. గతంలోనూ తను షూటింగ్స్ కోసం వివిధ నగరాల మధ్య ప్రయాణాలు చేసిన విషయాన్ని గుర్తుచేసింది.
ప్రస్తుతం అవికా గోర్ ‘ఖత్రోన్ కే ఖిలాడీ’ వంటి భారీ రియాలిటీ షోలతో పాటు పలు దక్షిణాది సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో ఆమె నటించిన ‘అగ్లీ స్టోరీ’ విడుదలకు సిద్ధమైంది.
