
హీరో శర్వానంద్ (Sharwanand) తన కొత్త సినిమా కోసం తెగ ప్రచారం చేస్తున్నాడు. ఏప్రిల్ 3న “బైకర్” (Biker) సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం ఏకంగా 22 కిలోలు తగ్గినట్లు చెపుతున్నాడు. అలాగే ఈ సినిమా కోసం ప్రభాస్ తో ఒక వీడియో ఇంటర్వ్యూ రికార్డు చేసినట్లు సమాచారం.
ప్రభాస్ – శర్వానంద్ వీడియో ఇంటర్వ్యూ త్వరలోనే బయటికి రానుంది. ఇక ఈ సినిమా విజయంపై శర్వానంద్ చాలా ధీమాగా ఉన్నాడు.
ఈ ఏడాది సంక్రాంతి పండుగ సీజన్ లో “నారి నారి నడుమ మురారి” సినిమా విడుదల చేశాడు. అది ఓ మోస్తరు విజయం ఇచ్చింది. యావరేజ్ చిత్రమే కానీ 2022 తర్వాత వచ్చిన మొదటి మోస్తరు సక్సెస్. అందుకే ఆ ఊపులో “బైకర్” విడుదల చేస్తున్నాడు. ఇది హిట్ అయితేనే శర్వానంద్ మిగతా సినిమాలకు క్రేజ్ ఉంటుంది.
ఈ ఏడాది సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న “భోగి” అనే మరో చిత్రాన్ని కూడా విడుదల చేస్తున్నాడు. ఒకే ఏడాది మూడు సినిమాలు.”భోగి”కి మంచి క్రేజ్ రావాలన్నా, బిజినెస్ బాగా జరగాలన్నా “బైకర్”తో హిట్ కొట్టాలి.
